G.O.A.T: విజయ్‌ గోట్‌ మూవీలో ఎమ్మెస్‌ ధోని?!

తమిళ హీరో విజయ్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ (గోట్‌). వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

మీనాక్షీ శేషాద్రి, స్నేహ, లైలా, మైక్‌ మోహన్‌, జయరామ్‌, ప్రశాంత్‌, ప్రభుదేవా, అజ్మల్‌, వైభవ్‌, యోగిబాబు, ప్రేమ్‌జీ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

మైదానంలో షూటింగ్‌
చైన్నెలో ప్రారంభం అయిన ఈ చిత్ర షూటింగ్‌ ఆ తరువాత థాయ్‌ల్యాండ్‌, టర్కీ దేశాల్లో జరుపుకుంది. ఇటీవల కేరళలో చిత్రీకరణను జరుపుకుంది. అక్కడ క్రికెట్‌ మైదానంలో కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు వెంకట్‌ప్రభు చిత్రీకరించారు. దీంతో యాక్షన్‌ అంశాలతో కూడిన ఇందులో క్రికెట్‌ క్రీడకు సంబంధించిన సన్నివేశాలు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది. అంతే కాకుండా ఇందులో స్టార్‌ క్రికెట్‌ క్రీడాకారుడు మహేంద్ర ధోని అతిథి పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రీమేక్‌ కాదు ఒరిజినల్‌
క్రికెట్‌ అంటే వెంకట్‌ప్రభుకు చాలా ఇంట్రెస్ట్‌. ఆయన ఇంతకు ముందు తెరకెక్కించిన చైన్నె 28 చిత్రం ఎంత మంచి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ సెంటిమెంట్‌ ఈ చిత్రానికి వర్కౌట్‌ అవుతుందేమో చూడాలి. ఇకపోతే గోట్‌ చిత్రం ఒక హాలీవుడ్‌ చిత్రానికి రీమేక్‌ అనే ప్రచారం జరగడంతో దాన్ని దర్శకుడు వెంకట్‌ప్రభు ఖండించారు. ఇది తాను రాసుకున్న ఒరిజినల్‌ కథతో తెరకెక్కిస్తున్న చిత్రం అని స్పష్టం చేశారు. అలాగే ఇది టైమ్‌ ట్రావెల్‌ కథా చిత్రం కూడా కాదని చెప్పారు. చిత్రంలో గ్రాఫిక్‌ సన్నివేశాలు అదిరిపోయేలా ఉంటాయని యూనిట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!