పటాన్ చెరువు, ఏప్రిల్ 11(డైలీ రిపోర్ట్):
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వెలిమల వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఉదయం పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు.
రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయించాలని విజ్ఞప్తి చేశారు. దళారులను ఆశ్రయిస్తే నష్టపోతారని సూచించారు. ప్రభుత్వం సన్న రకం వడ్ల పైన క్వింటాలుకు 2320 రూపాయలు తోపాటు అదనంగా 500 రూపాయలు బోనస్ గా చెల్లిస్తోందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, వెలిమెల పిఎసిఎస్ అధ్యక్షులు బుచ్చిరెడ్డి, సీనియర్ నాయకులు సోమిరెడ్డి, దేవేందర్ యాదవ్, మాజీ ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.