లగచర్ల లో అధికారులపై దాడి చేశారన్న అభియోగా ల కేసులో వీరిని అరెస్ట్ చేశారు
ఎట్టకేలకు లగచర్ల రైతులకు న్యాయం గెలిచింది
బీఆర్ఎస్ తరఫున గెలిచిన మరో న్యాయ పోరాటం
సంగారెడ్డి /కంది, డిసెంబర్ 20 (డైలీ రిపోర్ట్):
వికారాబాద్ జిల్లా లగచర్ల లో అధికారులపై దాడి చేశారన్న అభియోగాల కేసులో అరెస్ట యి, జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న 24 మంది రైతులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 11 న ఫార్మా విలేజ్ పేరుతో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం లగచర్ల వెళ్లారు. కార్యక్రమాన్ని రైతులు అడ్డుకున్నారు. రైతులు తమపై దాడి చేశారంటూ కొందరు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేరోజు అర్ధరాత్రి పోలీసులు ఐదు గ్రామాల్లో దొరికిన వారిని దొరికినట్టు గా అరెస్టు చేశారు. 17 మంది రైతులకు ఊరట లభించడం తోబాధిత కుటుంబాలు, బీఆర్‌ఎస్ శ్రేణుల హర్షం వ్యక్తమవుతోంది.
బీ ఆర్ ఎస్ పోరాటం వాళ్ళే ఈ విడుదల లభించింది. అయితే గురువారం నాడు బెయిల్ మంజూరైన మేలు పత్రాలు సరైన సమయానికి రాకపోవడంతో బెయిల్ పత్రాలు అందినప్పటికీ నిబంధనల ప్రకారం సాయంత్రం 6 దాటిన తర్వాత ఖైదీలను విడుదల చేయరు. దీంతో శుక్రవారం ఉదయం రైతులు కంది జైలు నుంచి శుక్రవారం ఉదయం వీరిని విడుదల చేయడం జరిగిందని అధికారులు తెలిపారు ఈ పోరాటం తో కాంగ్రెస్ రూట్ మార్చింది. మరోవైపు లాగచర్ల ఘటన రైతులకు ఊరట లభించింది. బెయిల్ రావడంతో బాధిత కుటుంబాల సభ్యులు కెటిఆర్ కు అభినందలు తెలియజేసారు. డిల్లీ స్థాయి కీ ఈ ఘటనను పోరాటం చేసి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోనెల ఈ గెలుపు బీ ఆర్ ఎస్ దే అని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి స్పెషల్ కోర్టు కొన్ని షరతులు విధించింది. వారికి రూ. 20 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. వీరికి ఒక షూరిటీ ఉండాలని తెలిపింది.