అదిలాబాద్ / డిసెంబర్ 15 (డైలీ రిపోర్ట్):
ఆదివారం సోమవారం నాడు జరగనున్న గ్రూప్ 2 పరీక్షలకు ఆన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా పాలనాధికారి ఆన్నారు.ఆదివారం జిల్లా కేంద్రం లోని మావల లోని చావర అకాడమి cbse సెకండరీ హై స్కూల్ , మహాత్మ గాంధి జ్యోతి బా పూలే పాఠశాల , భూక్తపూర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లలో ఏర్పాటుచేసిన గ్రూప్ 2 పరీక్షా కేంద్రాలను జిల్లా పాలనాధికారి ఆకస్మికంగా తనిఖీ చేసి , సిసి కెమెరా లను, అభ్యర్థుల హాజరు శాతం, బయోమెట్రిక్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు ఈ రోజు, రేపు (ఆదివారం , సోమవారం) రెండు రోజులు జిల్లా కేంద్రం లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుందనీ, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు.ఈ సందర్భంగా పలు పరీక్షా కేంద్రాల ను సందర్శించి పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించి, బయోమెట్రిక్, అభ్యర్థుల హాజరు శాతాన్ని, సిసి కెమెరాలను పరిశీలించారు.
రాష్ట్ర పబ్లిక్ కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ ప్రశాంత వాతావరణం లో పరీక్షలు జరిగేలా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఆదివారం ఉదయం సెషన్ లో జరిగిన పరీక్షకు జిల్లాలో మొత్తం 10,428 మంది అభ్యర్థులకు గాను, 5,905( 56.63 శాతం ) మంది హాజరు కాగా, 4,523. (43.37 శాతం) మంది గైర్హాజరు అయ్యారని వివరించారు. ఆది, సోమవారాలలో ఉదయం, మధ్యాహ్నం మొత్తం నాలుగు సెషన్ల లో జరిగే గ్రూప్-2 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా పాలనాధికారి తెలిపారు.