హఫీజ్ పేట్/హైదారాబాద్ 15( డైలీ రిపోర్ట్ )
ముస్లిం మైనార్టీలలో నిరుపేద పిల్లల విద్యాభ్యాసానికి, వారి జీవన శైలి పై అవగాహన పెంపొందించేందుకు మదర్సాలు దోహదపడతాయని ఏకే ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు.
హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్ మదరసా లో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్ని ఉన్నతమైన విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడానికి తమ వంతు సహకారం అందిస్తూ,సమాజ శ్రేయస్సుకు బాటలు వేస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు..
ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ జగదీశ్వర్ గౌడ్ గారు, టీపిసిసి సెక్రెటరీ షేక్ అబ్దుల్ గని, ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్, అబ్దుల్ ఖయ్యూం,మహమ్మద్ సాబీర్, సయ్యద్ ఇర్ఫాన్, ఇలియాస్, శ్యాం కుమార్, శ్రీకాంత్, అజీమ్,కరీం తదితరులు పాల్గొన్నారు.