మోమిన్ పెట్ /డైలీ రిపోర్ట్ :డిసెంబర్ 15
ప్రయాణికులు బస్సు ఎక్కే సమయంలో దిగే సమయంలో సెల్ ఫోన్, బంగారు ఆభరణాల దొంగతనాల పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి అని మోమిన్ పేట పోలీసు సిబ్బంది సూచనలు తెలుపునైనది ……….
వికారాబాద్ జిల్లా మోమిన్ పేట ఆర్టీసీ బస్టాండ్ లో బుధవారం నాడు మోమిన్ పేట పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పుండరీకము మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలు ప్రయాణికులు బస్సు ఎక్కే సమయంలో దిగే సమయంలో సెల్ ఫోన్, బంగారు ఆభరణాల దొంగతనాల పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి అని, మరియు మహిళలు ఆటోలో ఒంటరిగా ప్రయాణించవద్దు. మరియు తెలువని వారి ఆటోలో ఎక్కకూడదు. మరియు ఆడవారు పొలాలకు వెళ్లే సమయంలో కూలికి వెళ్లే సమయంలో బంగారు నగలు ధరించవద్దు. మరియు మహిళలు ఒంటరిగా విలువైన వస్తువులు వేసుకొని వాకింగ్ అని వెళ్లరాదు. మరియు వివాహాలకు విందులకు వెళ్లే సమయంలో తమ తమ ఇండ్లలో తెలిసిన వారిని పడుకోబెట్టి వెళ్ళాలి, అంతే కానీ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లకూడదు. ఇళ్లకు తాళాలు వేసిన ఇళ్లలోనే దొంగతనాలు జరుగుతాయి. నేటి ప్రస్తుతం సమాజంలో పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల, ఆర్థిక నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని, మరియు సైబర్ నేరాల లో డబ్బులు కోల్పోయినచో ఎక్కడ ఉన్నా కూడా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ (1930 ) కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలపాలని సూచించినారు. మరియు ఆడవాళ్ళ ఫోటోలతో మరియు పోలీసు అధికారుల ఫోటోలతో వీడియో కాల్స్ వచ్చినచో వాటిని మాట్లాడవద్దు అని సూచించినారు. మరియు అపరిచిత వ్యక్తులకు ఆడవారు తమ వ్యక్తిగత ఫోన్ నెంబర్లు ఇవ్వవద్దని సూచించారు, బస్సులో ప్రయాణించే సమయంలో బంగారు ఆభరణాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని, ఆన్ లైను లోన్ ఇస్తామని, మీకు బహుమతులు వచ్చాయని వచ్చే ఫోన్ కాల్స్ వల్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు, స్మార్ట్ ఫోన్ల నుండి పిల్లలను దూరంగా ఉంచాలని సూచించినారు. మరియు మహిళలు గాని పురుషులు గాని ఆత్మహత్యలు చేసుకోకూడదు అని సూచించినారు. ఈ కార్యక్రమంలో మోమిన్‌పేట పోలీసు శిక్షణ మహిళా ఎస్సై శ్రీమతి మణిమాల, హెడ్ కానిస్టేబుల్ దత్తాత్త్రి , కానిస్టేబుల్ శ్రీశైలం లు పాల్గోన్నారు.