తెలంగాణా బ్యూరో/కోదాడ డిసెంబర్ 14:
కోదాడ లో అభివృద్ధి పనులు చేయకముందే కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని కోదాడ బిఆర్ఎస్ పార్టీ నాయకులు బెజవాడ శ్రావణ్ అన్నారు. కోదాడ పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రావణ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కెసిఆర్ మీద తిట్లు, దేవుడు మీద ఓట్లు, ఇచ్చిన హామీలకు తూట్లు, అన్న సంకల్పంతోనే నడుస్తుందని, పేద ప్రజల ఆరోగ్యం ఆరోగ్య సదుపాయాల మీద పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.. కోదాడ పరిసర ప్రాంతాల్లో లక్షల మంది ప్రజలకు కోదాడ ప్రభుత్వాసుపత్రి పెద్దదిక్కు ప్రతిరోజు 500 మంది చికిత్స నిమిత్తం వైద్య సదుపాయాల కోసం వస్తూ ఉంటారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చొరవతో కేసీఆర్ కోదాడలో 30 పడకల హాస్పటల్ 100 పడకల హాస్పిటల్ గా అభివృద్ధి చేస్తూ 29 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు.
కానీ ప్రభుత్వ మారి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నెలలోపే కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్ కు ముగ్గురు మంత్రులు వచ్చి కెసిఆర్ ఇచ్చిన 29 కోట్ల రూపాయలతో కేవలం ఒక శిలాఫలకం వేసి కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులకు తట్టెడు మట్టి కూడా పోయకుండా వెళ్లారని తెలిపారు. 30 పడకల హాస్పిటల్ లో ఉండాల్సిన 16 మంది డాక్టర్లకు ముగ్గురు డాక్టర్లు మాత్రమే ఉన్నారు. కెసిఆర్ నిధులు కేటాయించిన 29 కోట్ల రూపాయలను వంద పడకల హాస్పిటల్ నిర్మాణానికి ఖర్చుపెట్టి పేద ప్రజల ఆరోగ్యం వైద్య సదుపాయాలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బెజవాడ శిరీష శ్రావణ్, రవి కుమార్ శిరీష ప్రతిమ మరియమ్మ వేణు ఉపేందర్ తరుణ్ నాని బోస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.