రాయికోడ్ లో సామాజిక తనిఖీ ప్రజాదర్బారా లేక అధికారుల దర్బారా..?

 

సంగారెడ్డి బ్యూరో డిసెంబర్ 11(డైలీ రిపోర్ట్):

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సమయపలనే కాదు అంతా దొందు దొందే అన్నట్లు కార్యాలయ సిబ్బంది తీరు అనేదే కాకుండా.. నేడు సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో నేడు జిల్లా అధికారులు జిల్లా అడిషనల్ ఏపిడి బల్ రాజ్, అడిషనల్ విజిలెన్స్ అధికారి నాగేశ్వర్ రావు, జిల్లా క్వాలిటీ కంట్రోల్ సుభాష్, క్లస్టర్ ఎపిడి రాజు, ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 14 వ విడత సామాజిక తనిఖీ లో భాగంగా నిర్వహించిన ప్రజావేదికలో పలు గ్రామ పంచాయతిల లో ఆదివారం రోజు మరియు గ్రామాల్లో డోర్ లాక్ ఉన్న ఉపాధి హామీ కూలీలా హాజరు వేయడం అధికారుల ముందు ఏస్సార్పి మరియు డిఆర్పీలు డోర్ టు డోర్ తిరిగి ఇచ్చిన నివేదికను జిల్లా అధికారుల ముందు వినిపించడంతో ఎపిఓ, ఈసీ, టెక్నీకల్ అసిస్టెంట్లు పంచాయతి కార్యదర్శులు మరియు ఫీల్డ్ అసిస్టెంట్ల ఘనకార్యలు బట్టబయలైంది. కుస్నూర్ గ్రామంలో కార్మికులుగా పనిచేస్తున్న వారికి పంచాయతి లో జితము ఇవ్వడమే కాకుండా గ్రామపంచాయతీ కార్మికులకు, ఆశావర్కర్ కు ఉపదిహమిలో హాజరు వేసి పేమెంట్లు చేసారని పంచాయతి కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందుర్ లో ఏం బుక్ లో పత్తి రైతుల కూలీలా సంతకాలు తీసుకున్నారని, నర్సరీకి సంబంధించి రికార్డు, సింగూర్ బ్యాక్ వాటర్ లో మునిగిన దానికి పనిచేసినట్లు పేమెంట్లు, మేజర్మెంట్ తక్కువ కానీ ఎక్కువ రాసినట్లు, గ్రామ ఆశవర్కర్ కు, పంచాయతి కార్మికుని కుటుంబంలో పనికి రాకుండా ఉపాధి హామీ పేమెంట్లు,పక్షవాతం వచ్చిన వాళ్లకు ఉపాధి హామీ పేమెంట్లు చేసారని అధికారుల ముందు తనిఖీ బృందం తెలిపారు.

 

రాయికోడ్ లో మొక్కలకు సంబంధించి రికార్డు, అవెన్యూ ప్లాంటేషన్ ఇంకొన్ని ప్లాంటేషన్లు పూర్తిగా బ్రతికిలేవని, మస్టర్లల్లో ఎక్కువగా కొట్టివేతలు ఉన్నాయని, 60 రోజులకు గాను 90 రోజుల ఎక్సెస్ పేమెంట్ చేసాడని, పంచాయతి రాజ్ రికార్డ్ ఇవ్వలేదని, రాత పూర్వకంగా ఓ మహిళ పని చేయకున్న పేమెంట్ ఇవ్వడం జరిగిందని, హైదరాబాద్ లో ఉన్న గ్రామానికి చెందిన యూవకునికి ఉపాధి హామీ కూలి డబ్బులు వేయడం జరిగిందని డోర్ వద్దకు వెళ్లిన డిఆర్పీ తో తన కుటుంబికులు తెలుపరని తనిఖీ బృందం అన్నారు. మొత్తం మీద ఆడిట్ బృందం వారికి సింగూర్ బ్యాక్ వాటర్ లో మునిగిన పనులు లేకుండా చెక్ మేజర్మెంట్లు చేసిన వారి ముందు రికార్డు లు ఇవ్వకపోవడం గమనార్హం అని వచ్చిన అధికారుల ముందు వాపోయారు.. పలు గ్రామాల్లో సంతకాలు హాజరు లేకుండ పేమెంట్లు, రికార్డులు లేకుండా పేమెంట్లు, 7th రిజిస్టర్ అప్డేషన్ లేదని, గ్రామసభలలో తప్పుడు రికార్డు లు ఉన్నాయని, జబ్ కార్డులు అప్డేషన్ లేవని, సిటిజన్ చార్ట్ నిర్వహించలేదని, రోజువారీ దివస్ నిర్వహించలేదని, అవెన్యూ ప్లాంటేషన్ సరిగ్గలేదని అన్నారు. అలాగే సంగపూర్ గ్రామంలోని అడ్వాన్స్ పేమెంట్ విషయంలో ఎస్టీమేషన్ ముందుగానే పేమెంట్ వర్క్ ఐడి లో జమ చేయడంతో ఈసీ విష్ణువర్ధన్ తను తప్పే చేయలేదని డిఆర్పీ మరియు ఎస్సార్పి లతో వాగ్వాదనికి దిగాడు అక్కడే ఉన్న ఉన్నత అధికారులు కలుగజేసుకోవడంతో సద్దుమనిగింది, పలు గ్రామాల్లో గ్రామసభ తీర్మానాలు ఇవ్వకపోగా, సెక్రటరీలు మాస్టర్ల పై సంతకాలు చేయలేదని, గ్రామల్లో సామాజిక తనిఖీ గ్రామసభలు ఉంటాయని టాంటాం చేపించలేదని, ఎక్సెస్ పేమెంట్, ప్లెసిప్పులు పంపిణీ చేయలేదని, కొలతలు పుస్తకాల్లో సంతకాలు తీసుకోలేదని, లెస్ పేమెంట్లు చేసారని, భార్య కు భర్తకు డబుల్ జబ్ కార్డ్ లు మంజూరు చేసారని ఏస్సార్పి మరియు డిఆర్పీలు జిల్లా అధికారుల ముందు తెలిపారు.. అందుకు గాను జిల్లా అడిషనల్ పిడి మాట్లాడుతూ తప్పుచేసిన వారికి షోకాజ్ నోటీసులు జరిచేస్తామని, అలాగే పనిచేయకున్న పలు గ్రామాల్లో చెల్లించిన ఉపాధి హామీ డబ్బులు రికవరీ చేయిస్తామని, అలాగే పంచాయతి కార్మికులకు ఆశవర్కర్ల కు వేసిన ఉపాధిహామీ డబ్బులు తిరిగి చెల్లింపు చేయిస్తామని అన్నారు, అలాగే సమావేశానికి హాజరు కానీ పంచాయతి కార్యదర్శులకు ఫీల్డ్ అసిస్టెంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.. రైతువేదిక వద్ద ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ లో గ్రామాల ప్రజలు లేకపోవడం అధికారులతోనే నిర్వహించడం పట్ల పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సౌండ్ స్పీకర్లు ఏర్పాటు చెయకపోవడంతో స్థానిక అధికారులపై జిల్లా అధికారులు ఫైర్ కాగా, సగం గ్రామాల విషయంలో డిఆర్పీలు చదివి వినిపించిన అనంతరం సౌండ్ స్పీకర్లు ఏర్పాటు చేశారు. వచ్చిన జిల్లా అధికారులకు చిన్న టెంట్ ఏర్పాటు చేయడంతో ఎండ వారిపై పడడంతో వారి టేబుళ్లను కుర్చీలను వారే పక్కకు జరుపుకోవడంతో అక్కడున్న వారికి అచ్చార్యానికి గురిచేసింది.. ఏదేమైనా నేడు నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజాదర్బార్ ఓ టైంపాస్ గా మారడం పలు విమర్శలకు తావిస్తోంది.. ఈ సామాజిక తనిఖీ ప్రజాదర్బార్ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, ఎస్సార్పి బాలు నాయక్, ఎంపిడిఓ షరీఫ్, ఎపిఓ, డిఆర్పీలు, పంచాయతి కార్యదర్శి లు, టెక్నీకల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!