శంకర్ పల్లి డిసెంబర్ 01 (డైలీ రిపోర్ట్):
ఆదివారం శంకర్ పల్లి మండల ఎమ్మార్పీఎస్ కార్యవర్గం సమావేశం మండల అధ్యక్షులు బండ్లగూడెం శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక అతిధి గృహం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ హాజరైన ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాదిగలను మోసం చేసింది అన్ని అన్నారు. త్వరలో నూతన గ్రామ కమిటీల నిర్మాణం చెసి ప్రభుత్వంపై ఉద్యమం తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాని భాను ప్రసాద్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు మండల ప్రధాన కార్యదర్శి అండూరి ప్రశాంత్ మాదిగ, కోశాధికారి నర్సింలు మాదిగ, ప్రచార కార్యదర్శి ప్రశాంత్ మాదిగ, పరుశురాం, హరిష్, ప్రవీణ్, ప్రభాకర్, సినియర్ నాయకులు లక్ష్మయ్య, శంకర్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.