నిద్రపోయేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పక్కన వీటిని పెట్టుకోకండి..

ప్రపంచం మీద ఉన్న ప్రతి జీవికి నిద్ర చాలా అవసరం. మనుషులకు ఈ నిద్ర మరింత ఎక్కువ అవసరం. కనీసం ఆరు గంటలు అయినా పడుకోవాల్సిందే. ఆహారంతో పాటు నిద్ర సరిగ్గా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది.

లేదంటే అనారోగ్య పాలు అవుతుంటారు. అందుకే శరీరానికి సరిపడా నిద్ర పోవాల్సిందే. ఈ సమయంలో శరీరంలోని ప్రతి అవయవానికి రెస్ట్ దొరుకుతుంది. ఇక ప్రశాంతమైన నిద్రకు పడుకునే స్థలం ఎంత బాగుండాలో.. చుట్టు ఉన్న వస్తువులు కూడా అంతే బాగుండాలి అంటారు.

అయితే పడుకునే సమయంలో కొన్ని వస్తువులు పక్కన ఉండకుండా చూసుకోవాలి. నిద్రించే సమయంలో కొన్ని వస్తువులు మన పక్కన ఉంటే దుష్ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందట. ఇంతకీ అవేంటి అనుకుంటున్నారా? నిద్రపోయే టప్పుడు పక్కన ఎక్కడ కూడా వాలెట్ ఉండకూడదట. పొరపాటును పర్సు పక్కన ఉంటే నిద్రించే టప్పుడు డబ్బుకు సంబంధించిన ఆలోచనల వల్ల సరిగ్గా నిద్ర కూడా పట్టదట. పర్సులో డబ్బు ఉందో లేదో అన్న భావన ఎక్కువగా ఉంటుంది. సో అవైడ్ చేయండి.

చాలా మందికి ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగడం అలవాటుగా ఉంటుంది. దీంతో నిద్రపోయేటప్పుడు బెడ్ కింద చెప్పులు వదిలి పడుకోవడం కూడా అలవాటుగానే ఉంటుంది. ఇలా చేస్తే ఇంట్లో మనశ్శాంతి కరువు అవుతుందని.. చికాకులు కలుగుతాయి అంటున్నారు శాస్త్రజ్ఞులు. ప్రశాంతంగా పడుకోవాలి అంటే బెడ్ రూమ్ లోకి చెప్పులను వేసుకొని వెళ్లకండి. కొందరికి నిద్ర పోయేవరకు సెల్ ఫోన్ ను పట్టుకొని ఉండడం అలవాటు. దీని వల్ల నిద్ర వస్తుంది అనుకుంటారు కానీ చుట్టుపక్కల కూడా సెల్ ఫోన్ ఉండకూడదు.

నిద్రించే ప్రదేశంలో పుస్తకాలు, వార్త పత్రికలు కూడా ఉంచకపోవడమే బెటర్. ఇలా ఉంచితే సరస్వతి దేవిని అవమానించినట్టు అంటారు పెద్దలు. కాబట్టి ఆరోగ్యకరమైన నిద్ర, మంచి నిద్ర కావాలంటే ఇవన్నీ పాటించండి. ఆరోగ్యంగా ఉండండి. తెలుసుకున్నారు కదా జాగ్రత్త.. మంచి నిద్ర ఉంటే మంచి ఆరోగ్యం మీ సొంతం అని మర్చిపోకండి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!