ప్రభుత్వ విద్యను బలోపేతం చేయండి

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయండి
గుర్తిపు లేని పలు ప్రయివేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను తక్షణమే రద్దు చేయాలి

ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్

 

సిద్దిపేట ఆగస్టు 05(డైలీ రిపోర్ట్)


సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలొ గల ప్రభుత్వ జూనియర్ కళాశాల లొ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లొ ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్ గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో గల ప్రభుత్వ విద్యాసంస్థలను రేషలైజేషన్ పేరిట ఎత్తివేస్తూ, పలు ప్రయివేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు అండ దండగ ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అయన విమర్శించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను రేషలైజేషన్ పేరిట ఎత్తివేస్తే మేము చూస్తూ ఊరుకోబోమని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తక్షణమే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలనీ లేని పక్షం లొ మా విద్యార్ధి సంఘము ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం లు చేపడుతామని ఈ సందర్బంగా ఆయన తెలియచేసారు. ప్రయివేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డ్యూయ్యాబేట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర నుండి మేల్కొని ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూ, గుర్తింపు లేని ప్రయివేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్తున్ని కొండ ప్రశాంత్ గారు డిమాండ్ చేశారు.లేని మా విద్యార్ధి సంఘము ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమం లొ జిల్లా నాయకులు రాకేష్, యాదగిరి, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!