ఖాస్తులో ఉన్న పొజిషన్ పట్టాలు మంజూరు చేయాలి: బి కే ఎం యూ
భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ నాయకులు కలెక్టరేట్ ఎదుట నిరసన
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి,ఆగస్టు 05 (డైలీ రిపోర్ట్)
ఖాస్తులో ఉన్న పొజిషన్ పట్టాలు మంజూరు చేయాలంటు భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ నాయకులు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన గళం విప్పారు.
వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా సదాశివ పట్టణంలోని సిద్దాపుర్ కాలనీలో సర్వే నెంబర్ 260″ లో గత ఆరు సంవత్సరాల క్రితం పూరి పాకలు వేసుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. కాలనీలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకున్నా అన్ని రకాల ఇబ్బందులు పడుతూ అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి మద్దతుగా
భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ నాయకులు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖాస్తులో ఉన్న పొజిషన్ పట్టాలు మంజూరు చేయాలని గత ప్రభుత్వంలో దఫాలుగా మొరపెట్టుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది .ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా స్పందించి ఖాస్తు లోఉన్న పొజిషన్ పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి తాజుద్దీన్, ఉపాధ్యక్షురాలు, పెద్దాపురం వినోద తదితరులు పాల్గొన్నారు.