బొల్లారం, ఆగస్టు 03(డైలీ రిపోర్ట్)
బొల్లారం మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు బాలాజీ నగర్ కాలనీలో మున్సిపల్ జనరల్ నిధులతో ఏర్పాటు చేస్తున్న నూతన డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసారు.స్థానిక వార్డ్ కౌన్సిలర్ గుండ్ల సుజాత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్ రోజా రాణి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ఇంజనీరింగ్ సెక్షన్ ప్రశాంత్ మున్సిపల్ అధికారులు, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 32