రాష్ట్ర యువత అధ్యక్షులుగా నర్రా మధు కుమార్ నియామకం

రాష్ట్ర యువత అధ్యక్షులుగా నర్రా మధు కుమార్ నియామకం

సంఘం బలోపేతం కోసం కృషి చేయాలి

తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యే ఎంపీలు రాజీనామా చేయాలి
తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సింహ్మయ్య

రంగారెడ్డి , ఆగస్టు 03(డైలీ రిపోర్ట్)

తెలంగాణ మాల మహానాడు యువత రాష్ట్ర అధ్యక్షులుగా రంగారెడ్డి జిల్లా బి హెచ్ ఈ ఎల్ కు చెందిన నర్ర మధు కుమార్ ను నియమించి నియామక పత్రం అందజేసిన తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సింహ్మయ్య. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సింహ్మయ్య మాట్లాడుతూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని ప్రభుత్వాలకు అధికారం ఇస్తూ తీర్పు ఇవ్వడాన్ని తెలంగాణ మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుంది అన్నారు. ఐదు మందితో కూడిన ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని ఇది రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పినప్పటికీ కూడా మనువాద రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ దళితులను విచ్చిన్నం చేయడానికి కుట్రపూరితంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఏడు మందితో కూడిన ధర్మాసనం సుప్రీంకోర్టు జడ్జిలతో కుమ్మక్కై రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు ఇప్పించారని మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తామన్నారు. యువత మౌనం దేశానికే ప్రమాదం కాబట్టి మాల యువత పెద్ద ఎత్తున ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా, రాజ్యాంగ రక్షణకు, మాలల హక్కుల కోసం కలిసి రావాలన్నారు. సంఘం బలోపేతం కోసం రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో యువత కమిటీలు వేసి సంఘం బలోపేతం చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా మాల ఎంపీలు మాల ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మేము చేసే పోరాటానికి మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనియెడల తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధుల ఇండ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆగస్టు 9న జరిగే మాలల మహాధర్నా పెద్ద ఎత్తున యువత తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా నూతనంగా తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర యువత అధ్యక్షులుగా నియమితులైన నర్ర మధు కుమార్ మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యత ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సింహ్మయ్య కి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ చీమల దారి నాగేశ్వరరావు కి నా ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. నా మీద మరింత బాధ్యత పెరిగిందని తెలంగాణ రాష్ట్ర మాల యువతను జాగృతం చేసి రాష్ట్రవ్యాప్తంగా మాల యువతను ఏకతాటిపైకి తీసుకువచ్చి మాలల హక్కుల కోసం పోరాటం చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ చీమలధారి నాగేశ్వరరావు, బైండ్ల శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!