తమన్నా కి కొత్త పేరు పెట్టిన తెలుగు హీరో.. ఏంటో తెలిస్తే నవ్వుకుంటారు..!

మిల్కీ బ్యూటీ అనగానే అందరికీ గుర్తొచ్చే .. ఒకే ఒక్క పేరు తమన్న.. ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ ఆమెకే సొంతం అంటూ పలువురు జనాలు కూడా ఆమెను బాగా సపోర్ట్ చేశారు.

ముట్టుకుంటే కందిపోతుందేమో అనిపించేటటువంటి సున్నితమైన నాజుకు గల చర్మం ఆమె సొంతం. టాప్ టు బాటమ్ ప్యూర్ వైట్ గా ఉండే తమన్నాకు జనాలే మిల్కీ బ్యూటీ అంటూ ట్యాగ్ ఇచ్చారు.

 

ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఆమెను ఇదే పేరుతో పిలవడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అయితే గతంలో ఓ హీరో ఆమెకు మరొక బిరుదు కూడా ఇచ్చాడు అన్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది . ఆయన మరెవరో కాదు అల్లు అర్జున్ . ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ – తమన్నా కలిసి బద్రీనాథ్ అనే సినిమాలో కలిసి నటించారు . ఈ సినిమా మంచి హిట్ అందుకుంది.

 

మరి ముఖ్యంగా ఈ సినిమాలో వీళ్ళిద్దరి డాన్స్ పెర్ఫార్మెన్స్ కెవ్వు కేక.. అనే చెప్పాలి . పక్కాగా చెప్పాలి అంటే అల్లు అర్జున్ ని మించిపోయే డాన్స్ చేసింది మిల్కీ బ్యూటీ . దీంతో బన్నీ కూడా ఫిదా అయిపోయాడు. అంతేకాదు ఆమెకు ఏకంగా డాన్సింగ్ డాల్ అంటూ కొత్త పేరును కూడా ఇచ్చారు. అప్పట్లో ఈ విషయం బాగా హైలైట్ గా మారింది . అయితే తమన్న కంటే బాగా డాన్స్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు . అల్లు అర్జున్ మాత్రమే ఆమెకు ఇలాంటి పేరు పెట్టడం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. తమన్నా చాలా మంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది . కానీ అల్లు అర్జున్ మాత్రమే ఆమెకు ఇలాంటి బిరుదు ఇవ్వడం గమనార్హం..!!

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!