జనరల్ గా స్టార్ హీరోస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గొడవలు

జనరల్ గా స్టార్ హీరోస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గొడవలు పడడం ..ట్రోల్ చేసుకోవడం లాంటిదే మనం చూస్తూ ఉంటాం .. ఇద్దరు స్టార్ హీరో ఫ్యాన్స్ కలిసి సపోర్ట్ చేసుకొని ఒక హీరో సినిమాకి మరొక హీరో సపోర్ట్ చేస్తే ఫ్యాన్స్ చాలా రేర్ గా చూస్తూ ఉంటాం.

తాజాగా సోషల్ మీడియాలో అలాంటి వార్త ఒకటి బాగా వైరల్ గా మారింది . రీసెంట్గా రాంచరణ్ తన పుట్టినరోజు ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే .

 

శ్రీవారిని దర్శించుకున్నారు ..ఇదే మూమెంట్లో తన కూతురికి ఫేస్ కూడా అనుకోకుండా రివీల్ అయింది. భక్తులకు.. ఫాన్స్ కు ఈ విధంగా చరణ్ బర్త డే సర్ప్రైజ్ ఇచ్చాడు అంటూ ఫ్యాన్స్ కూడా మురిసిపోయారు. కాగా చరణ్ తల్లి సురేఖ కొడుకు పుట్టినరోజు సందర్భంగా 500 మందికి అన్నదానం చేసింది . అంతేకాదు మెగా ఫ్యాన్స్ కేక్ కటింగ్ పార్టీలతో చరణ్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు . అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ బర్త్డ డేను ఘనంగా సెలబ్రేట్ చేయడం గమనార్హం.

 

వందమంది ఆర్ఫనెజ్ పిల్లలకు ఫుడ్ డొనేట్ చేశారు . దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. బాక్స్ లో ఫ్రెష్ హెల్తీ ఫుడ్ తో పాటు ..ఫుడ్ బాక్స్ పైన చరం – ప్రభాస్ కలిసి ఉన్న ఫోటోలు కూడా ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేశారు . దీంతో రాంచరణ్ ఫాన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. అంతేకాదు పలువురు జనాలు కూడా ఈ హెల్తీ నేచర్ ని సపోర్ట్ చేస్తున్నారు.

ఇండస్ట్రీలో ఫ్యాన్స్ ఇలానే ఉండాలి అని అప్పుడే ఇండస్ట్రీ బాగుపడుతుంది అని.. ఒక హీరో ఫ్యాన్స్ మరొక హీరో ఫ్యాన్స్ కి సపోర్ట్ చేస్తూ ఇలాంటి పనులు చేస్తేనే రియల్ అభిమానం అంటారు అని.. ఎవరైతే మిగతా హీరో ఫ్యాన్స్ కొట్టుకొని చస్తూ ఉంటారో.. వాళ్లని వీళ్లను చూసి నేర్చుకోండిరా అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ప్రెసెంట్ రాంచరణ్ బర్త డే కి ప్రభాస్ అభిమానులు చేసిన పని నెట్టింట టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది..!!

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!