అనసూయకు అక్కడి నుండి వార్నింగ్ వచ్చిందా..? అందుకే భయపడి జనసేన ఇష్యూ పై అలా మాట్లాడిందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . అందాల ముద్దుగుమ్మ యాంకర్ అనసూయకు పైనుంచి ప్రెజర్ పెరిగిందా ..? అందువల్లే ఆమె సోషల్ మీడియాలో అలాంటి కామెంట్స్ చేసిందా..?

అన్న విషయం ఇప్పుడు హాట్ హాట్ గా వైరల్ అవుతుంది . కేవలం కొద్ది రోజులే కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయింది . పలువురు సినీ ప్రముఖులు కూడా ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొంటూ పోటీ చేస్తూ ఉండడంతో సినీ ఫీల్డ్ లో కూడా ఈసారి ఏపీ రాజకీయాలపై ఇంట్రెస్ట్ చూపిస్తుంది.

 

ఇలాంటి క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూకి అటెండ్ అయిన యాంకర్ అనసూయకు ఓ ప్రశ్న ఎదురయింది . ‘మీకు జనసేన పార్టీ తరపున ప్రచారం చేయడానికి ఎవరైనా పిలిస్తే వెళ్తారా ..?’అంటూ హోస్ట్ ప్రశ్నిస్తారు. దీనికి అనసూయ ఆన్సర్ ఇస్తూ కేవలం జనసేన కాదు .. రోజా గారు పిలిచినా కూడా వెళ్తాను .. కొన్ని కొన్ని పార్టీలకు కొన్ని కొన్ని అజెండాలు ఉంటాయి .. అది నాకు నచ్చితే కచ్చితంగా నేను వాళ్లకు సపోర్ట్ చేస్తాను అంటూ చెప్పుకు వచ్చింది . అయితే ఆమె వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తూ జనసేన పార్టీకి సపోర్ట్ చేయడానికి సిద్ధపడింది అనసూయ అంటూ బాగా ట్రెండ్ చేశారు .

 

దీంతో అనసూయ దీనిపై స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. నేను అలా అనలేదు అని.. ఎవరైనా సరే తన పార్టీకి ప్రమోట్ చేయమంటే ఆ పార్టీ విధివిధానాలు నచ్చితే నేను ప్రమోట్ చేస్తాను అని చెప్పానని క్లారిటీ ఇచ్చింది. నిజానికి అనసూయ పై సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వైరల్ అవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడూ కూడా ఈ రేంజ్ లో క్లారిటీ ఇవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అనసూయ ఈ ఇష్యూ పై స్పందించడంతో ఆమె జనసేనకు సపోర్ట్ చేస్తుంది అని .. తెలిసి ఆమెకు పైనుంచి ప్రెజర్ పెరిగాయి అని .. ఆమెకు బాగా కావాల్సిన వాళ్ళు కూడా అనుకు వార్నింగ్ ఇచ్చారు అని.. ఆ కారణంగానే అనసూయ ఈ విధంగా పరోక్షంగా స్పందించింది అని చెప్పుకొస్తున్నారు జనాలు . దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!