గత ఏడాది చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో మాడ్ సినిమా కూడా ఒకటిగా నిలుస్తుంది.

 

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించగా అనంతిక, గౌరీ ప్రియా రెడ్డి, గోపిక విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాక కామెడీ సినిమాలకు తెలుగులో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని నిరూపించింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ తెరకెక్కే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ సీక్వెల్ గురించి క్లారిటీ వచ్చేసింది. అసలు విషయం ఏమిటంటే టిల్లు స్క్వేర్ సినిమాకి ఈ సినిమా దర్శకుడు కళ్యాణ్ శంకర్ కూడా రైటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు.

 

ఈ నేపథ్యంలో టిల్లు స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఆయన కూడా పాల్గొన్నాడు. దీంతో మీడియా ఆయనని మీ మ్యాడ్ సీక్వల్ ఎంతవరకు వచ్చింది అని అడిగితే ఈ విషయమై ఆయన స్పందించారు. ఈ సీక్వెల్ కి టైటిల్ ఫిక్స్ చేసామని మాడ్ మాక్స్ పేరుతో సీక్వెల్ తెరకెక్కుతుందని వెల్లడించడమే కాదు సినిమా షూటింగ్ 12వ తేదీ ఏప్రిల్ నెల నుంచి మొదలుపెట్టబోతున్నామని ఆయన వెల్లడించారు. అయితే ఆఫ్ ది రికార్డుగా అందుతున్న సమాచారం మేరకు మొదటి మ్యాడ్ సినిమా అంతా ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో ఉండగా ఈ సీక్వెల్ మాత్రం ఆ ముగ్గురు కుర్రాళ్ళు ఉద్యోగాలు వేటలో పడడంతో ఉంటుందని అంటున్నారు. హీరోయిన్లు మారే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతోంది. లేదు వారినే కంటిన్యూ చేస్తారని మరో ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంటుంది అనేది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!